అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన పుత్తా నరసింహారెడ్డి

11 Nov, 26
 0  12
అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన పుత్తా నరసింహారెడ్డి
అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన పుత్తా నరసింహారెడ్డి

అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన పుత్తా నరసింహారెడ్డికమలాపురం నియోజకవర్గ పరిధిలోని కమలాపురం మండలంలో రెండు గ్రామాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పుత్తా నరసింహారెడ్డి గారు పరామర్శించి, మృతదేహాలకు పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.మొదటగా మండలంలోని నసంతపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గంగయ్య గారు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి చేరుకున్న పుత్తా నరసింహారెడ్డి గారు, ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతితెలియజేశారు.అనంతరం చిన్నచెప్పాలి పంచాయతీ పరిధిలోని భయనపల్లి గ్రామానికి చెందిన రేవతి గారు మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.