అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్‌కు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం!

11 Nov, 26
 0  45
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్‌కు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం!
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్‌కు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం!

అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్‌కు ప్రెస్ క్లబ్ ఆర్థిక సహాయం!


రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత – బాధిత జర్నలిస్టుకు అండగా నిలవాలని దాతలకు విజ్ఞప్తి


కడప, నవంబర్ 11: జర్నలిస్ట్ కార్తీక్ యాదవ్ (SBNEWS9550)


అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కెమెరామెన్ అరవీటి వెంకటేష్‌కు కడప వైఎస్సార్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, ఆపద సమయంలో తోటి జర్నలిస్టులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.


ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం సమాచారాన్ని అందించేందుకు జర్నలిస్టులు తమ వ్యక్తిగత జీవితాలను, ఆరోగ్యాన్ని సైతం పక్కనపెట్టి నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వార్తల సేకరణలో భాగంగా ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.


ప్రతి జర్నలిస్టు వెనుక ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు కడప ప్రెస్ క్లబ్ తరఫున రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సీనియర్ కెమెరామెన్ అరవీటి వెంకటేష్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసినట్లు వెల్లడించారు.


ఈ సందర్భంగా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అరవీటి వెంకటేష్‌కు దాతలు, జర్నలిస్టు సంఘాలు, తోటి జర్నలిస్టులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఆయన త్వరగా కోలుకునేందుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు లక్ష్మీనాథ్ రెడ్డి, ఉప్పు శ్రీకాంత్, సుధీర్, సురేంద్ర, బాబు నాయుడు, కమ్మన్న తదితరులు పాల్గొన్నారు.