మైనార్టీ సంక్షేమ దినోత్సవం & జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు*
*మైనార్టీ సంక్షేమ దినోత్సవం & జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు**భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన అల్పసంఖ్యాక వర్గాల దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్.బి. అంజాద్ భాషా గారు.*ఈ సందర్భంగా అంజాద్ భాషా గారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమనిచాటిచెప్పినమహనీయుడని కొనియాడారు. దేశ విద్యా వ్యవస్థ పటిష్టతకు, మైనార్టీల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.*ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ అధ్యక్షులు బి.హెచ్. ఇలియాజ్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షిండే రవిచంద్రరావు, మాజీ కార్పొరేటర్లు అజ్మతుల్లా ఖాన్, డిష్ జిలాన్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శులు ఫయాజ్ అహ్మద్, నాయకులు గయాజ్, గులాం గౌస్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.