మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత**
విశాఖపట్నం:** ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికైప్రజలకుసేవలందించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రోశయ్య హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.2017లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శత్రుచర్లవిజయరామరాజుమరణంతోరాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
**SBNEWS9550 | జర్నలిస్ట్ కార్తీక్ యాదవ్**